పల్లవి :
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం
అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా
॥
చరణం : 1
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి
॥
వెలుతురైనా చీకటైనా విడిపోదు
ఈ అనుబంధం ॥
చరణం : 2
తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి
॥
ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం
॥
చిత్రం : అన్నదమ్ముల అనుబంధం (1975)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, బృందం