పల్లవి :
చల్లగాలికి చెప్పాలనివుంది
మన కథ ఈవేళ
చందమామకు చెప్పాలనివుంది
సరసకు రావేలా
వింతలు చూపి పులకింతలు రేపి
మురిపించే కలని
తోడుగవుండి మనసంతా నిండి
నడిపించే జతని చల్లగాలికి॥
చరణం : 1
నువ్వున్నది నాకోసం నేనే నీకోసంలా
నిలిచేది మన ప్రేమలా
నువులేని ప్రతి నిమిషం ఎదలో
ఒక గాయంలా
కరిగే ఈ కన్నీటిలా
మనసున ఇంద్రజాలమే
ఈ ప్రేమ పరువపు పూలవానలే
ఇరువురి వలపు వంతెనే
ఈ ప్రేమ సకలం ప్రేమ సొంతమే
చరణం : 2
ఆ... నిపపద గరిమగరిస... ఆ...
నిదురంటూ మటుమాయం
కుదురంటూ కరువే
ప్రతి గమకం సంగీతమే
ప్రతి ఊహ ఒక కావ్యం
ప్రతి ఊసు మైకం
ప్రతి చూపు పులకింతలే
చెదరని ఇంద్రధనసులే
ఈ ప్రేమ తొలకరి వానజల్లులే
కరగని పండు వెన్నెలే
ఈ ప్రేమ కలిగిన వేళ హాయిలే
చిత్రం : ధమ్ (2003)
రచన : సురేంద్రకృష్ణ
సంగీతం : రమణగోగుల
గానం : హరిహరన్, నందిత