Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : రాఖీ (2006)
రచన : సుద్దాల అశోకతేజ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : అమల్‌రాజ్, ప్రియా, బృందం


సాకీ :
చూసేటి కళ్లుంటే జమీనంతా రంగుల చెల్క
పాడేటి నోరుంటే జమానంతా రంగుల పల్క
ఆడేటి కాళ్లుంటే ఆస్మానంతా
రంగు రంగుల చిల్క

పల్లవి :
హే... రంగు రబ్బ రబ్బ
అంటుంది రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే... ఓయ్...
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే బర్‌సే
ఓ ఓ... గాల్లో ఒళ్లు తేలిపోతుంటే రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే హే బర్‌సే
గల్లి పోరగాళ్లు గంతేస్తే రంగు బర్‌సే
బర్‌సే బర్‌సే బర్‌సే హే బర్‌సే
ఏ హలో హలో సబ్ చలో చలో
అప్ గలేమిలో ఇది రంగోళి
నషాకరో యా నిషాకరో
అరె మస్త్ మస్త్ మస్తుగుంటే రంగేళి
లీ... హోలీ... లీ... హోలీ... ॥

చరణం : 1
కత్తిచూపే ఎద కోసే ఎరుపు
కొంటె నవ్వే విరబూసే తెలుపు
గిచ్చావంటే నా చెంపే నలుపు
మెచ్చావంటే నా బతుకే పసుపు
చుట్టపు చేతులతోని నడుమంతా చుడ్తావా
పట్టెపు మంచం పైన నే పచ్చి ముద్దవుతా
రాతిరి ఒంటరిగొచ్చి ఒళ్లంతా తడిమావా
రంగుల విల్లుని కానా నీ చేత
లీ... హోలీ... లీ... హోలీ...
రేసు గుర్రా రేసు గుర్రా
రేసు గుర్రా నిద్రలేచింది రంగు బర్‌సే
వయసు తాచుపాము బుస్సంటే రంగు బర్‌సే

చరణం : 2
అమ్మంటేనే మన ప్రాణం రంగు
చంటిపాపే దైవానికి రంగు
దోస్తి అంటే త్యాగానికి రంగు
పుట్టినూరే దేశానికి రంగు
హే... నువ్వని నేననీ తేడా
కనిపించే దునియాలో
అందరిని ఒక్కటి చేసే ఈ పండగ రంగేరా
ఏ బతుకును బద్దలు చేసే గద్దారిని పడగొట్టే
పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా
లీ... హోలీ... లీ... హోలీ... ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |