Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు ॥

చరణం : 1
ఎవరికెవరు వే శారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము ॥
నీకు నేను అమ్మనూ నాన్ననూ (2)
నాకు నీవే లోకాన సర్వమూ (2)

చరణం : 2
కన్న కడుపు తీయదనం కన్న
నీకు అన్న ఒడి వెచ్చదనం మిన్న ॥
పదినాళ్ల పాపగానే ఒదిగావు (2)
హృదయమే ఊయలగా ఊగావు (2)

పల్లవి :
చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు ॥

చరణం : 1
హృదయాలను మూయవీ తలుపులు
విడదీశారమ్మా మన తనువులు

ఉన్నవాళ్లే నీకింక నీ వాళ్లు (2)
తుడిచివేయవమ్మా నీ కన్నీళ్లు

చరణం : 2
అన్న ఒడి వెచ్చదనం కోసం
కన్ను మూయకున్నావు పాపం ॥
ఎదను చీల్చి పాడుతున్న జోలలు (2)
నిదురపుచ్చులే నిన్ను అమ్మలు (2)

చిత్రం : ఆస్తిపరులు (1966)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల

14/03/2011 - నేడు కె.వి.మహదేవన్ జయంతి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |