Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
గుండుసూది గుండుసూది
గుచ్చుకుంది గుండుసూది
గుంజిందయ్యో గుండె నాది
గుట్టులాగిందయ్యో పండు లాగి
గుండుసూది గుండుసూది
గుచ్చుకుంటే తప్పు నాది
తగ్గించనా నెప్పి నీది హాయి
తెప్పించనా ఊది ఊది

చరణం :
1 తగిన వేళల తొలిసారి
తెగని వేళల మలిసారి
పడక వేళల ప్రతిసారి
పగటి వేళల ఒకసారి
ఈ కోప తాపాలన్నీ తీరేలాగ
నన్నే ఊపాలి బ్రహ్మచారి
నీ గోరు వంకల్లోన చేరేవేళ నేనే
అయిపోనా భామచారి
అమ్మమ్మ అబ్బబ్బబ్బా
హయ్యయ్యయ్యో అంతా వినక
అచ్చచ్చో చిచ్చో పిచ్చో
సిగ్గులకే సెలవిచ్చో వచ్చేయి వెనక
చూపాలయ్యో ఊపు నీది
నాకు చెప్పాలయ్యో తీపి సోది
॥॥

చరణం : 2
నీకు బోలెడు అది ఉంది
నాకు బుట్టెడు ఇది ఉంది
ఎత్తిపోతల పదునుంది
ఉక్కపోతల పని ఉంది
మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే
తేనెల్ల్లో ఈది ఈది
చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన
మారాలి తేది తేది
ఇంకింకా ఇంకా ఇంకా
కావాలింకా అహా చురక
స్ర్తీలంక చూడాలింకా
నాతోనే తోడింక ఛీపో అనక
నచ్చావయ్యో ఉగ్రవాది
నిన్ను చేసెయ్యనా జన్మ ఖైదీ


చిత్రం : ఛత్రపతి (2005)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కీరవాణి, సునీత

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |