కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య
మాయింటికంపించవయ్య మావయ్యా
ఆ చేయి యీ చేయి అద్దగోడలికి
ఆ మాట యీ మాట పెద్దకోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లొ దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా కాపురం చేసే
మా చంటి పాపను మన్నించి పంపు
మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్యనేలేటి సాకేతరామా
చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు
గానం : చిత్ర
రచన :వేటూరి
సంగీతం:కీరవాణి