పల్లవి :
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల
జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా (2)
చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల
జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశ లతలోన జనించు తేనె సోన
వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా
॥
చరణం : 1
ఒకే పదం ఒకే విధం కుహు కుహు
అదే వ్రతం అదే మతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది
అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది
చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మా శ్రమించి
కొత్తపాట దిద్దుకోమ్మ ఖరీదు కాదులేమ్మ
॥
చరణం : 2
మావిళ్లలో నీ గూటిలో ఎన్నాళ్లిలా హా హా
మా ఊరిలో కచ్చేరిలో పాడాలిగా హా హా
చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా
తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ
దమ్ములుంటే నాపైన నెగ్గవమ్మ అదంత
తేలికేమి కాదులేమ్మా ఎత్తాలి కొత్త జన్మ
॥
చిత్రం : ఆంధ్రుడు (2005)
రచన : చంద్రబోస్
సంగీతం : కళ్యాణి మాలిక్
గానం : శ్రేయాఘోషల్