Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
కొంత కాలం కొంత కాలం
కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం
రేపు కూడ రావాలి
(కొంత కాలం)
ఎంత కాలంమెంత కాలం
హద్దు మీరకుండాలి
అంత కాలమంత కాలం
ఈడు నిద్దరాపాలి
కొంత కాలం

చరణం : 1
గుండె విరహములో మండే వేసవిలో
నువ్వే శీతకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి
నువ్వే ఎండకాలం
మదనుడికి పిలుపు మల్లె కాలం
మదిలోనె నిలుపు ఎల్లకాలం
చెలరేగు వలపు చెలి కాలం
కలనైన తెలుపు కలకాలం
తొలి గిలి కాలం కౌగిలికాలం
మన కాలం ఇది... ఆ...
(కొంత కాలం)
చరణం : 2
కన్నె మోజులకు సన్నజాజులకు
కరిగే జాము కాలం
గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు
వచ్చే ప్రేమకాలం
తమి తీరకుండు తడి కాలం
క్షణమాగనంది ఒడి కాలం
కడిగింది సిగ్గు తొలికాలం
మరిగింది మనసు మలి కాలం
మరి సిరికాలం మగసిరి కాలం
మన కాలం పదా... ఆ...
(కొంత కాలం)

చిత్రం : చంద్రముఖి (2005)
రచన : వెన్నెలకంటి
సంగీతం : విద్యాసాగర్
గానం : సుజాత, యదు బాలకృష్ణ

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |