Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి : లోకాలే గెలవగ నిలిచినాస్నేహాల విలువలు
తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపినా ఆకాశం భూమిని
కలిపినా ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన
ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువున
నీవే నీవే నీవే నీవుగా ॥

చరణం : 1
ఈ పువ్వు కోరిందిరా ప్రేమాభిషేకాలనే
నా చూపు పంపిందిలే పన్నీటి మేఘాలనే
బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై
సిరిబొట్టువై నాతోనే నువ్వుండిపో
ఊపిరై ఎద చిలిపినై ఊపునై
కనుచూపునై నీలోనే నేనుంటినే
నీ రామచిలుకను నేనై నా రామచంద్రుడు నీవై
కలిసే ఉంటే అంతే చాలురా ॥

చరణం : 2
ఈ రాధ బృందావనం సుస్వాగతం అందిరా
నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే
పక్కగా రారని కవ్ముగా
ముద్దివ్ముని ఎన్నాళ్లు కోరాలిరా
ఎప్పుడూ కనురెప్పలా చప్పుడై
ఎదలోపల ఉంటూనే ఉన్నానుగా
సన్నారు స్వరముల మధురిమ
పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ
అన్నీ నీవై నన్నే చేరరా ॥

చిత్రం : బాలు (2005)
రచన : జొన్నవిత్తుల
సంగీతం : మణిశర్మ
గానం : మురళి, చిత్ర

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |