Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

మరువలేనురా నిన్ను నేను మరువలేనురా
ఓ…. పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా
ఓయ్ వాలు కన్నుల మువ్వలెంకటసామి నిన్ను నేను మరువలేనురా

నీకు వచ్చింది కోరమీసం నాకు వచ్చింది దోర వయసు

ఇద్దరి మనసు ఒక్కటైతే…. హోయ్.. ఇద్దరి మనసు ఒక్కటైతే
ఎఱక చింతల్లేని బతుకె ఎంకటసామి
నిన్ను నేను మరువలేనురా
ఓ…. పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా

కన్నూ కన్నూ కలిసిందోయ్ .. నిన్నూ నన్నూ కలిపిందోయ్

ఈడనున్న నేనేడనున్న నీ నీడనేనోయ్ .. హోయ్..
ఈడనున్న నేనేడనున్న నీ నీడనేనోయ్
పోలీసెంకటసామి నిన్ను మరువలేనురా

నా వాడవేనోయ్ పోలీసెంకటసామి
నా వాడవేనోయ్ పోలీసెంకటసామి
సందులేదు మనకు చందమామ తోడు
నిన్ను నేను మరువలేనురా
ఓ…. పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా
ఓయ్ వాలు కన్నుల మువ్వలెంకటసామి నిన్ను నేను మరువలేనురా

గానం : ఘంటసాల వేంకటేశ్వరరావు

0 Comments:

Post a Comment