Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : అల్లరి మొగుడు (1992)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

పల్లవి :
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో
ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ॥

చరణం : 1
ముందరున్న ముద్దరాలి
ముద్దు చెల్లిద్దు ఇటు చూద్దూ
మండుతున్న మోహనాంగి
మత్తు కలిగిద్దు ఇటు రద్దు
పెదవి పొడుపుకథ విప్పేద్దు చెప్పేద్దు గుట్టు
అదుపు పొదుపు ఇక చాల్లెద్దు చంపేద్దు బెట్టు
అనువైన అందుబాటు చూడమంది॥

చరణం : 2
వేడి వేడి ఈడు ఊదుకుంటూ
చవి చూద్దూ చెలి విందు
వేడుకైన జోడు చూడమంటూ
జరిపిద్దు జడ కిందు
నిదర నదిని క సుకందేలా కరిగిద్దు పొద్దు
మదన పదవి మనకందేలా చెరిపేద్దు హద్దు
సడిలేని సద్దుబాటు చేయమంది॥

19/03/2011 - మోహన్‌బాబు బర్త్‌డే

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |