|
|
పల్లవి : శీత వేళ రానీయకు... రానీయకు శిశిరానికి చోటీయకు... చోటీయకు వేళ... ఎద లోపల పూలకారు ఏనాటికీ... పోనీయకు... వేళ...
చరణం : 1 ఉగ్రమైన వేసంగి గాడ్పులు ఆగ్రహించి పై బడినా అదిరి పోవకు అదిరి పోవకు... ఒక్కుమ్మడిగా వర్షామేఘం వెక్కివెక్కి రోదించినా లెక్క చేయకు... లెక్క చేయకు... వేళ....
చరణం : 2 చైత్రంలో తొగరెక్కిన కొత్త కోర్కెలు శరత్తులో కెపైక్కే తీయని కలలు మనసారా తీర్చుకో మనుగడ పండించుకో లోకానికి పొలిమేరను నీ లోకం నిలుపుకో వేళ...
చరణం : 3 ఉదయాన కలత నిదర చెదిరిపోవువేళ మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ ముసలి తనపుటడుగుల సడి ముంగిట వినబడేనా (2) వీట లేడనీ చెప్పించు వీలు కాదనీ పంపించు వేళ...
చిత్రం : మేఘసందేశం (1982) రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి సంగీతం : రమేష్‌నాయుడు గానం : పి.సుశీల, కె.జె.ఏసుదాస్ | |
30/09/2010 - దేవులపల్లి కృష్ణశాస్ర్తి జయంతి