Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : భక్తకన్నప్ప (1976)
రచన : ఆరుద్ర
సంగీతం : సత్యం
గానం : వి.రామకృష్ణ

పల్లవి : శ్రీకాళహస్తీశ్వరా హరహర
కరుణించి నను బ్రోవరా
దేవర కైవల్య పదమీయరా ॥

చరణం : 1
ఆలయమన్నది లేదని నీకై అల్లెను
గుడులను సాలీడు
ఆ భక్తుడు నీవు సంశోధించ
అగ్నిపరీక్షను పొందాడు
నీ గుడి రూపము చెరిపిన దీపము
మ్రింగ దలంచెను పురుగు
ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది
ముక్తినొసంగిన దేవా ॥

చరణం : 2
పన్నగ మొక్కటి ప్రతి ఉదయమ్మున
ఎన్నో మణులను తెచ్చేదీ
నిన్నే పూజించేదీ
పాముయొనర్చిన పూజను మెచ్చక
ఏనుగు దానిని తుడిచేదీ
వేరే పూజలు చేసేదీ
ఒకరు యెనర్చిన పూజలునొల్లనొ
కరికాళమ్ములు పగబూనీ
తరుణము కొరకై వేచినవీ
తొండము నుండి దూరిన పాము
మెండుగ గజమును బాధించే
కొండను మోదగ కుంభము పగులగ
రెండొక తరి మరణించె
నీకై పోరిన ఆ ప్రాణులకు
నీ సాయుజ్యము లభియించే
జంతుసంతతికి ఇచ్చిన మోక్షము
సదాశివా దయచేయవా ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |