Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : కుదిరితే కప్పుకాఫీ (2011)
రచన : సిరివెన్నెల సీతారామశాస్ర్తి
సంగీతం : యోగీశ్వరశర్మ (సిరివెన్నెల తనయుడు)
గానం : ఎస్.పి.బాలు, నిహాల్


పల్లవి :
శ్రీకారం చుడుతున్నట్టు
కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులేవి చూస్తున్నాయో
మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు
రాబోయే పండ గ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు
దాక్కుందే బంగరుబొమ్మా ॥
జల జల జల జాజుల వాన
కిల కిల కిల కిన్నెర వీణ
మిల మిల మిన్నంచులపైన
మెలిదిరిగిన చంచల యాన
మధురోహల లాహిరిలోన
మదినూపే మదిరవె జాణ

చరణం : 1
నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి
నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాసె్తైనా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపును ముళ్లై గుచ్చే
కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని తీరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీగాలై సోకినవారు గాలిబ్ గజలైపోతారు
నీమేను తాకినవారు నిలువెల్లా విరులౌతారు
కవితవో యువతివో ఎవతివో
గుర్తించేదెట్టాగమ్మా

చరణం : 2
నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు
చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటూ
ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీక టినే చూస్తూ నిద్దురనే వెలివేయద్దు
వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టు
అందాకా మారామ్మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుక్కాని
నడిమివో హరిణివో తరుణివో
మురిపించే ముద్దులగుమ్మ

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |