Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి : వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు ॥
అనుపల్లవి :
పెద్దలంత పిల్లలుగా మారే రోజు (2)
పల్లేదో పట్టణమేదో తెలియని రోజు ॥
దీపావళి రోజు... దీపావళి రోజు...॥

చరణం : 1
చంటిపాప నవ్వులకు
పువ్వులు విరిసే రోజు (2)
మింటనున్న తారకలు
ఇంటింట వెలిగే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే
॥॥

చరణం : 2
జీవితం క్షణికమని
చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వల్లే బతకాలని
తారాజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం
ముప్పుతెచ్చి పెడుతుందని (2)
తానందుకు సాక్ష్యమని
టపాకాయ చె బుతుంది
॥॥
చిత్రం : రామయ్య తండ్రి (1975)
రచన : మల్లెమాల
సంగీతం : సత్యం
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |