Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : చక్రవాకం (1974)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : వి.రామకృష్ణ, పి.సుశీల

పల్లవి :
వీణలేని తీగను నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను
ముగిసిందని మరణించలేను ॥వీణలేని॥
జీవించలేను... మరణించలేను...

చరణం : 1
మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లింది
నిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మంది
॥వీణలేని॥

మరువలేని మనసుకన్నా నరకమేముంది
ఆ నరకమందే బ్రతకమని
నా నొసట నువ్వే రాసింది ॥వీణలేని ॥

చరణం : 2
వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుంది
తెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుంది
తీగ మారినా కొత్త రాగం పలకనంటుంది
పాత స్మృతులే మాసిపోక బాధపడుతుంది
జీవించలేను... మరణించలేను...

చరణం : 3
బంగబారిన గుండె నాది
పగిలిపోదు చెదిరిపోదు
నువ్వు పేర్చిన ప్రేమ చితిలో
కాలిపోదు బూదికాదు
నిన్ను కలిసే ఆశలేదు
నిజం తెలిసే దారిలేదు
చివరికి నీ జీవితానికి చిటికెడంత విషం లేదు
జీవించలేను... మరణించలేను...




20/03/2011 - నేడు శోభన్‌బాబు వర్ధంతి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |