పల్లవి :
యమహో నీ యమా యమా అందం
చెలరేగింది ఎగాదిగా తాపం
నమహో నీ జమజమ వాటం
సుడిరేగింది ఎడాపెడా తాళం
ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి
మోజుల్లో నీకు మొగుడంటివాణ్ణి
అల్లారు ముద్దాల్లో గాయం
విరబూసింది పూవులికీ ప్రాయం
॥
చరణం : 1
నల్లని కాటుక పెట్టి
గాజులు పెట్టి గజ్జాకట్టి
గుట్టుగా సెంటేకొట్టి
వడ్డాణాలే ఒంటికి పెట్టి
తెల్లని చీరా కట్టి
మల్లెలు చుట్టి కొప్పున పెట్టి
పచ్చని పాదాలకి ఎరన్రి బొట్టు పారాణెట్టి
చీకటింక దీపామెట్టి చీకుచింత పక్కానెట్టి
నిన్ను నాలో దాచిపెట్టి
నన్ను నీకు దోచిపెట్టి
పెట్టుకోత వద్దే చిట్టంకి
చెయి పట్టెన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడేముళ్లమ్మి
నువు పుట్టింది నాకోసం అమ్మి
ఇక నీ సొగసు నా వయసు
పెనుకునే ప్రేమలలో ॥
చరణం : 2
పట్టెమంచమేసిపెట్టి
పాలుబెట్టి పండు పెట్టి
పక్కమీద పూలుగొట్టి
పక్కపక్కానొళ్లోబెట్టి
ఆకులో వక్కాబెట్టి
సున్నాలెట్టి చిలకాజుట్టి
ముద్దుగా నోట్లో పెట్టి
పరువాలన్నీ పండాబెట్టి
చీరగుట్టు సారేబెట్టి సిగ్గులన్నీ నానాబెట్టి
కళ్లలోన ఒత్తులెట్టి కౌగిలింత మాటూపెట్టి
ఒట్టేపెట్టి వచ్చేశాక మావా
నిను ఒళ్లో పెట్టి లాలించేదే ప్రేమ
చెట్టయి సందెసీకట్లోన
నను కట్టేయి కౌగిలింతల్లోన
ఇక ఆ గొడవ ఈ చొరవ
ఆగవులే అలజడిలో ॥
చిత్రం:జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి