Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : శ్రేయా ఘోషల్


పల్లవి :
చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది
నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుంది వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైన ట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు ॥

చరణం : 1
గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీది నాది
తలపులు వేరైనా కలవని తీరైనా
బలపడిపోతుందే ఉండే కొద్దీ
లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశం పైకి వెళుతున్నట్టు
తారలన్నీ తారస పడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు ॥నాతోనే॥

చరణం : 2
నీపై కోపాన్ని ఎందరి ముందైనా
బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా
తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే ॥నాతోనే॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |