Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : బొంబాయి ప్రియుడు (1996)
రచన : వేటూరి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, ప్రతిమారావు


పల్లవి :
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా
నను వీడని జత నీవని ॥
ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా
తలరాతకు తలవంచదు ప్రేమ... ఆ...


చరణం : 1
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా
కల ఇలా కౌగిలై కనే కలే వెన్నెలై
చేయి కలిపిన చెలిమే అనురాగం... ఆ...


చరణం : 2
నిన్నుతాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం
రసానికో రాగమై రచించని కావ్యమై
చేయి కలిపిన చలవే అనుబంధం ॥

16thApril - నేడు జె.డి.చక్రవర్తి బర్త్‌డే

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |