Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : కళ్యాణ మంటపం (1971)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : పి.సుశీల


పల్లవి :
చుక్కలు పాడే శుభమంత్రం
దిక్కులు నిండే దివ్యమంత్రం
ఎక్కడనో ఎపుడో ఎవరో పలికిన వేదమంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో...
నా చెవిలో ఊదిన మంత్రం మధు మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం

చరణం : 1
రెక్కలపై ఆ గువ్వల జంట... ఆ...
రేకులలో ఆ పుష్పాల జంట... ఆ...

సాగుచునే... ఊగుచునే...
మధుర మధురముగ మక్కువగ
చదువుకునే ఆనంద మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం

చరణం : 2
కన్నులు ఒకపరి మూసుకొని...
నీవన్నది మరి మరి తలచుకొని...

ఒక్కతెనే నేనొక్కతెనే
అదే పనిగనే సదా మనసులో
ఆలపించే ప్రియ మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం

చరణం : 3
కోవెల దైవం పిలిచేదాకా... ఆ...
ఆవలి ఒడ్డున నిలిచేదాకా... ఆ...

నాలోనే... లోలోనే...
నాతిచరామి నాతిచరామి
అది నా ప్రాణ మంత్రం

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |