చిత్రం : దొంగలముఠా (2011)
రచన : సిరాశ్రీ
సంగీతం : సత్యం
గానం : హేమచంద్ర, శ్రావణ భార్గవి, శ్రీనివాస్ భరద్వాజ్
పల్లవి : దెబ్బకు ఠా దొంగలముఠా
పేలెను ఠా తుపాకి తూటా
తప్పదట ఈ వేట ఎందుకటా గలాటా॥
చరణం : 1
కట్టేసి ఓ జట్టు పనిపట్టై అంటా
గుట్టంతా కనిపెట్టై అంటా
పెట్టేసి బుల్లెట్టు గురిపెట్టై అంటా
భయపెట్టి తొడకొట్టై అంటా
పట్టు పట్టు లోగుట్టు... పట్టినాక హాం ఫట్టు
మూటకట్టి లోనెట్టు... కొట్టు కొట్టు జై కొట్టు
జట్టు కట్టి లాఠీ దాటి లూటి
ఆట ఆట ఆట ఆట... ॥
చరణం : 2
దోచే ఆట దాచై మూట కూల్చలేరు మన కోట
మనదే మాట మనదే బాట
ఎదురే మనకు లేదంటా
సయ్యాట దొంగాట ఈ చోట ఆ పేటా
ఆటాడి ప్రతిపూట ముంచేద్దాం నట్టేటా
మాతోటి సాటి పోటీ అంటే ఎవరూ లేరంటా
మా దీటు పోటుగాళ్లు కేటుగాళ్లు లేరంటా
తీద్దాం తాట తీర్చి తీటా
కత్తుల పోటా బెదరకు బేటా
మన ముఠా ఠా ఠా ఠా ఠా ఠా... ॥
6th April - నేడు సిరాశ్రీ బర్త్‌డే