Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : మిరపకాయ్ (2011)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎస్.థమన్
గానం : కార్తీక్, గీతామాధురి


పల్లవి :
గది తలుపులు గడియలు బిగిసెను
చూసుకో మహానుభావా
అది తెలిసిన బిడియము జడిసెను ఎందుకో
తలమునకల తలపుల అలజడి
దేనికో గ్రహించలేవా
అరమరికల తెరవిడు అలికిడి
పోల్చుకో తేల్చుకో
ఉడికే ఈడుతో పడలేకున్నా
దయతో నన్నాదుకో దరికొస్తున్నా
కొరికే ఈ కోరికే వివరిస్తున్నా
నిను తాకే గాలితో వినిపిస్తున్నా
రమణి రహస్య యాతన చూశా
తగు సహాయమై వచ్చేశా
కనుక అదరక బెదరక
నా జంటే కోరుకో చేరుకో ॥
చెక్... నువ్వంత అవస్త పడుతున్నా
అదంత సమస్య కాదన్నా
చిలకరో చిటికెలో తపన తగ్గించిపోలేనా

చరణం : 1
ఆశగిల్లిందని ధ్యాసమళ్లిందని
ఇంత గల్లంత నీవల్లే లేలెమ్మని
వచ్చి నిందించనీ తెచ్చి అందించనీ
ఓర్చుకోలేని ఆపసోపాలనీ ॥
పడతి ప్రయాస గమనిస్తున్నా
నే తయారుగానే ఉన్నా
సొగసు విరివిలో విరిసిన ప్రియభారం దించుకో పంచుకో
ఇదిగో తీసుకో ఎదనే ఉన్నా
నిధులన్నీ దోచుకో ఎవరేమన్నా

చరణం : 2
అగ్గిరవ్వంటినీ దగ్గరవ్వాలనీ
కెవ్వుమంటూ ఇటూ సిగ్గుపోవాలనీ
చెప్పకుండా విని చెంతకొస్తావనీ
గుండె చెప్పిందిలే గుర్తుపట్టావనీ ॥
తెలిసి మరెందుకీ ఆలస్యం
తక్షణం తథాస్తనుకుందాం
నివురు వదిలిన నిప్పులు
నిలువెల్ల మోజుతో రాజుకో
ఉరికే ఊహలో విహరిస్తున్నా
మతిపోయే మాయలో మునకేస్తున్నా ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |