Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : బాలమిత్రుల కథ (1973)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సత్యం
గానం : ఎస్.జానకి


పల్లవి :
గున్నమామిడీ కొమ్మమీద గూళ్లు రెండుండేవి
గున్నమామిడీ కొమ్మమీద గూళ్లు రెండుండేవి
ఒక గూటిలోన చిలకుండేది
ఒక గూటిలోన కోయిలుండేది ॥

చరణం : 1
తీగలాగ అల్లిన చెలిమి
తెగుతుందని దిగులుపడి
కొమ్మవిడిన ఆ జంట కొత్తగూడు చేరింది ॥
ఒక్కనాడు రామచిలక ఉక్కుడేగ నీడకు జడిసి
కోయిలతో చెప్పలేక గూడు విడిచిపోయింది
జోడు చెదిరిపోయింది ॥

చరణం : 2
చిన్ని చిలక ఏదనీ కన్నతల్లి అడిగితే
కోయిలేమి బదులిస్తుంది
కుమిలి కుమిలి ఏడుస్తుంది ॥చిలక॥

కోనకోనలో తిరిగీ కొమ్మ కొమ్మను అడిగీ
కొదమ చిలక కనరాకుంటే
కోయిలగతి ఏమవుతుంది
గుండె పగిలి చస్తుంది

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |