చిత్రం : ఎలా చెప్పను (2003)
రచన : సిరివెన్నెల
సంగీతం : కోటి
గానం : కె.ఎస్.చిత్ర
పల్లవి :
ఈ క్షణం ఒకే ఒక కోరిక...
నీ స్వరం వినాలని తియ్యగా ॥క్షణం॥
తరగని దూరములో తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటోంది ఆశగా ॥క్షణం॥
చరణం : 1
ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగా వెళ్లావన్న సంగతి
గుర్తేలేని గుండె ఇది... ఆ...
మళ్లీ నిన్ను చూసేదాకా నాలో నన్ను
ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది
॥క్షణం॥
చరణం : 2
రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే
మళ్లీ మళ్లీ తలచుకుని... ఆ...
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ
ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది
॥క్షణం॥