Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : శ్రీరామదాసు (2006)
రచన : జె.కె.భారవి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : సునీత


ఇదిగిదిగో నా రాముడు
ఈడనె కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనె మురిపాలాడినాడు
ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే

పచ్చగ ఐదోతనమె పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపూకుంకుమ రాళ్లివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకు పోయిన ఆనవాళ్లు ఇవే
ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి నా రామునికీడ నిలువనీడ లేదిదేమి
నిలువనీడ లేదిదేమి...

6th April:సుజాతకు నివాళి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |