Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : లవకుశ (1963)
రచన : స
ముద్రాల
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, లీల, సుశీల, మల్లిక్, వైదేహి


సాకీ :
జయజయరాం జయరఘురాం...
జయజయరాం జయరఘురాం...

పల్లవి :
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే...

అనుపల్లవి :
జనకుని మాటల తలపై నిలిపి
తన సుఖముల విడి వనితామణితో
వనములకేగిన ధర్మావతారుడు
జగదభిరాముడు శ్రీరాముడే

చరణం : 1
కరమున ధనువు శరములు దాలిచి
కరమున ధనువు... ఆ... ఆ... ఆ...
కరమున ధనువు శరములు దాలిచి
ఇరువది చేతుల దొరనే కూలిచి
సురలను గాచిన వీరాధివీరుడు
జగదభిరాముడు శ్రీరాముడే...

చరణం : 2
ఆలుమగల అనురాగాలకు (2)
పోలిక సీతారాములెయనగా (2)
వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు
జగదభిరాముడు శ్రీరాముడే... ఆ...

చరణం : 3
నిరతము ధర్మము నెరపీ నిలిపి... ఆ...
నిరతము ధర్మము నెరపీ నిలిపి
నరులకు సురలకు తరతరాలకు
ఒరవడియైన వరయుగపురుషుడు
జగదభిరాముడు శ్రీరాముడే...

చరణం : 4
ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనేలే డని (2)
జనుల భజించే పురుషోత్తముడు
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జయజయరాం జయరఘురాం... (4)



శ్రీరామనవమి స్పెషల్

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |