Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ప్రేమనగర్ (1971)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె .వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల


పల్లవి :
కడవెత్తుకొచ్చింది... కన్నెపిల్ల...
అది కనబడితే చాలు నా గుండె గుల్ల ॥
కాడెత్తుకొచ్చాడూ... గడుసు పిల్లడు...
వాడు కనబడితే చాలు నాకొళ్ళు తెలవదు ॥
చరణం : 1
పిక్కల పైదాకా చుక్కల చీరగట్టి (2)
పిడికిలంత నడుము చుట్టు పైటకొంగు బిగగట్టి
వెళుతుంటే చూడాలి...
వెళుతుంటే చూడాలి దాని నడక
అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక ॥

చరణం : 2
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు (2)
బిరుసైన కండరాలు... (2)
మెరిసేటి కళ్లడాలు వస్తుంటే చూడాలి
వస్తుంటే చూడాలి వాడి సోకు
వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు ॥

చరణం : 3
తలపాగ బాగచుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులోవాడు ॥
దున్నుతుంటే చూడాలి
దున్నుతుంటే చూడాలి వాడి జోరు
వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు ॥

చరణం : 4
నీలాటి రేవులోన నీళ్లకడవముంచుతూ
ఒంగింది చిన్నదీ ఒంపులన్నీ ఉన్నదీ॥
చూస్తుంటే చాలు దాని సోకుమాడా
పడి చస్తాను వస్తనంటె కాళ్లకాడ ॥॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |