చిత్రం : కొత్తబంగారులోకం (2008)
రచన : శ్రీకాంత్ అడ్డాల
సంగీతం : మిక్కీ జె.మేయర్
గానం: కృష్ణచైతన్య,ఆదిత్య,సిద్ధార్థ, క్రాంతి, శశికిరణ్
పల్లవి :
కళాశాలలో... కళాశాలలో...
కలలు ఆశలు కలిసిన ఫేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు ॥
పుస్తకమన్నది తెరిచే వేళా
అక్షరం వెనుక దాక్కొని ఉంది
కళ్లతో వంతెన కడుతూ ఉంటే
దాటేటందుకు మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగశాల (2) ॥
చరణం 1
సౌండ్ గురించి చదివాము
హార్ట్‌బీటేంటో తెలియలేదు
లైట్ గురించి చదివాము
నీ కళ్ల రిజల్ట్ తెలియలేదు
మ్యాగ్నటిక్స్ చదివాము
ఆకర్షణేంటో తెలియలేదు
విద్యుత్ గురించి చదివాము
ఆవేశం ఏంటో తెలియలేదు
ఫిజిక్స్ మొత్తం చదివినా
అర్థం కాని విషయాలన్నీ
నీ ఫిజిక్ చూసిన వెంటనే
అర్థం అయిపోయాయే ॥
చరణం :2
లోలకంలాగ ఊగుతూ సాగే
మీ నడుములన్నీ స్క్రూగేజ్‌తోనే
కొలిచెయ్యలేమా
గాలికే కందే మీ సుకుమార
లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్
తూచెయ్యలేదా
న్యూటన్ మూడవ నియమం చర్య ప్రతిచర్య
మీ వైపు చూస్తూ ఉంది రోజూ మేమేగా
మా వైపు చూడకపోతే చాలా తప్పేగా
క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే ॥॥