Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : సుఖదుఃఖాలు (1968)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
మేడంటే మేడా కాదు
గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాదీ
పొదరిల్లు మాదీ...

చరణం : 1
నేనైతే ఆకూ కొమ్మా... ఆ...
తానైతే వెన్నెల వెల్లా... ఆ... ॥
పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాదీ ॥

చరణం : 2
కోవెల్లో వెలిగే దీపం దేవీ మా తల్లి
కోవెల్లో తిరిగే పాటల గువ్వ నా చెల్లి
గువ్వంటే గువ్వా కాదు గొరవంక గానీ
వంకంటే వంకాగాదు నెలవంక గానీ ॥

చరణం : 3
గోరింక పెళ్లైపోతే ఏ వంకో వెళ్లిపోతే (2)
గూడంతా గుబులై పోదా
గుండెల్లో దిగులై పోదా ॥

5th April - నేడు ఎస్.పి.కోదండపాణి వర్ధంతి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |