Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : రాజకోట రహస్యం (1971)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : విజయా కృష్ణమూర్తి
గానం : ఘంటసాల, పి.సుశీల


పల్లవి :
నెలవంక తొంగి చూసింది
చలిగాలి మేను సోకింది
మనసైన చెలువ కనులందు నిలువ
తనువెల్ల పొంగి పూచింది
నెలవంక తొంగి చూసింది
చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక
నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది

చరణం : 1
ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికె (2)
ఏ పూలనోము ఫలమో నీ రూపమందు నిలిచె
సుడిగాలులైన జడివానలైన
విడిపోని బంధమే వెలసె ॥

చరణం : 2
ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత
ఏనాటి కైన ఏ చోటనైన
విడిపోనిదోయి మన జంట ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |