Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : లిటిల్ సోల్జర్స్ (1996)
రచన : సిరివెన్నెల
సంగీతం : శ్రీ
గానం : రాం చక్రవ ర్తి, ఎం.ఎం.శ్రీలేఖ


పల్లవి :
ఓ ఓ ఓ వెండి వెన్నెలా
ఓ ఓ ఓ దిగిరా ఇలా
అమ్మ కొంగులో చంటి పాపలా
మబ్బు చాటునే ఉంటే ఎలా
పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవా
మదిలో దాగిన మధుభావాలకి
వెలుగే చూపవా
మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెల

చరణం : 1
ఓ ఓ ఓ సుప్రభాతమా
ఓ ఓ ఓ శుభమంత్రమా
మేలుకొమ్మనే ప్రేమగీతమా
చేరుకున్న నా తొలిచైత్రమా
నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగానది
ఈ క్షణాన నీ జత చేరాలని అలలౌతున్నది
వెల్లువలా చేరుకోనా వేచియున్న సంద్రమా

చరణం : 2
అంత దూరమా స్వర్గమన్నది
చిటికెలో ఇలా మనదైనది
అందరానిదా స్వప్నమన్నది
అందమైన ఈ నిజమైనది
చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని
ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని
ప్రతిరోజు పండుగల్లే సాగుతోంది జీవితం

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |