Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : బంపర్ ఆఫర్ (2009)
రచన : భాస్కరభట్ల
సంగీతం, గానం : రఘు కుంచె


పల్లవి :
ఓలమ్మో... ఓలమ్మో...
ఓలమ్మో ఓలమ్మో నీ కొంపేకొల్లేరమ్మో
నీ అమ్మ నీ బాబు రోడ్డెక్కి పోతారమ్మో
ఓలమ్మో... ఓలమ్మో...
ఓలమ్మో ఓలమ్మో శని పట్టించేత్తానమ్మో
అరగుండె కొట్టించి సున్నం బొట్టెడతానమ్మో
ఓలమ్మో... ఓలమ్మో...

చరణం : 1
పప్పే రుబ్బిస్తానే పల్లీలమ్మిస్తానే
ఆడి గల్లా పట్టి గల్లీ గల్లీ రిచ్చా తొక్కిస్తానే
ఓలమ్మో... ఓలమ్మో...
ఆడి మక్కెలు ఇరిచేస్తానే
నీ చుక్కలు చూపిస్తానే
అరె డొక్కే చించి డోలే కట్టి మోతే మోగిస్తానే
ఆడి పేగులు తీసి పలావు చేసి
ఆడి పేగులు తీసి పలావు చేసి కుక్కలకేస్తానే
ఓలమ్మో... ఓలమ్మో...


చరణం : 2
నేనేంటో చూపిస్తానే కొవ్వంతా కరిగిస్తానే
ముప్పుతిప్పలు పెట్టి
మూడు చెరువుల నీళ్లే తాగిస్తానే
ఓలమ్మో... ఓలమ్మో...
కప్పులు కడిగిస్తానే నా చెప్పులు మోయిస్తానే
ఒక చీపురక ట్టే చేతికి ఇచ్చి రోడ్లే తుడిపిస్తానే
ఆడి బతుకును మొత్తం బజారుకీడ్చి
ఆడి బతుకును మొత్తం
బజారుకీడ్చి బంతాడేస్తానే
ఓలమ్మో... ఓలమ్మో...

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |