చిత్రం : ఓ తండ్రి ఓ కొడుకు (1994)
రచన : వేటూరి
సంగీతం : శిర్పి
గానం : కె.ఎస్.చిత్ర, బృందం
పల్లవి :
ఉగాది వేళ చిలిపిగ కోకిలమ్మ వేసే ఈలలే
కరిగిన పంజరాలలోన పలికిన పంచదార వీణ ॥
చరణం : 1
కొండలు తాకి చలి కోనలు సోకి
అల్లరి చేసే నెమలెండలలోన
ఏ వానవిల్లు రేగే నాలో
పావడ కట్టి తొలి ప్రాయము నాడే
వాకిలి తీసే ప్రియ వాంఛలు నేడే
ఉయ్యాలలూగే ఊహలెన్నో
జలకములాడే చిలకమ్మా
పులి ఎదురైతే పరుగమ్మా
వేటదాగి పాట మీది వెర్రి భామలు ॥
చరణం : 2
నీటికి నీరే సెలయేటికి ఏరై
చీరగ మారి చిలికింతలలోన
చేపమ్మకైన చెంగు జారే
నీలాటి రేవే చెరసాలగ మారి
చక్కిలిగింతే తగిలించిన వేళ
ఏ కొండగాలో కొంగులాగే
పులి ఎవరంటా చలి కొమ్మ
గిలిపెడుతోంది ఎదలోన
శీఘ్రమేవ వ్యాఘ్రమొస్తే దిక్కు లేదులే ॥