చిత్రం : పెళ్లికానుక (1960)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎ.ఎం.రాజా
గానం : ఎ.ఎం.రాజా, పి.సుశీల
పల్లవి :
వాడుక మరచెదవేల
నను వేడుక చేసెదవేల
నిను చూడని దినము నాకొక యుగము
నీకు తెలుసును నిజము... (2)
వాడుక మరువను నేను
నిను వేడుక చేయగలేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము... (2)
చరణం : 1
సంజరంగుల చల్లని గాలుల
మధుర రాగము మంజుల గానము ॥
తేనె విందుల తీయని కలలూ
మరిచిపోయిన వేళ
ఇక మనకీ మనుగడ ఏల
నీ అందము చూపి డెందము ఊపి
ఆశ రేపెదవేలా ఆశ రేపెదవేలా
ఓ ఓ ఓ... సంజరంగుల సాగినా
చల్లగాలులు ఆగినా ॥
కలసి మెలసిన కన్నులలోన... (2)
మనసు చూడగలేవా...
మరులు తోడగలేవా...
వాడుక మరువను నేను
నిను వేడుక చేయగలేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము... (2) ॥మరువను॥
చరణం : 2
కన్నులా ఇవి కలల వెన్నెలా
చిన్నె వన్నెల చిలిపి తెన్నులా ॥
మనసు తెలిసీ మర్మమేలా
ఇంత తొందర ఏలా
ఇటు పంతాలాడుట మేలా
నాకందరికన్నా ఆశలు ఉన్నా
హద్దు కాదనగలనా... హద్దు కాదనగలనా
వాడని నవ్వులతోడ
నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లోకము మరచి
ఏకమౌదము కలసి... ఏకమౌదము కలసి
8th April : నేడు ఎ.ఎం.రాజా వర్ధంతి