Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : చక్రవాకం (1974)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల


పల్లవి :
ఆ... ఆ... ఆ... సరిగమ రిమదదాగరిసా
దనిసరినిరి సానీ దాపా
మపదని పదపనీ దపమ గరిస నీరీసా
వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదము
అది ఎలాగైనది రాగము ॥
వీణలోనా... తీగలోనా...

చరణం : 1
మాటలోనా మనసులోనా
ఎక్కడున్నది భావము
అది ఎప్పుడవును గానము ॥
నాదమునకు స్వరమే రాగము
మనసులోని మాటే భావము
రాగభావములేకమైనది రమ్యమైన గానము
వీణలోనా... తీగలోనా...

చరణం : 2
గతజన్మ శృతి చేసుకున్నది
అది ఈ జన్మ సంగీతమైనది ॥
సరిగమ పదనిసా నిదపమగరిసా
రాగాల ఆరోహణవరోహణైనది
అనురాగ హృదయాల అన్వేషణైనది
వీణలోనా... తీగలోనా...

చరణం : 3
గుండెలోనా గొంతులోనా ఎక్కడున్నది ఆవేదన
అది ఎలాగవును సాధన ॥
గీతమునకు బలమే వేదన
రాగమునకు మెరుగే సాధన
గుండె గొంతుకలేకమైనది నిండు రాగాలాపన ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |