Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : జయం మనదేరా! (2000)
సంగీతం, గానం : వందేమాతరం శ్రీనివాస్


పల్లవి :
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ॥చిన్ని॥
ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే
తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే
ఆనందము ఆకాశము
సందడై సంద్రమై ఉప్పొంగెనే ॥చిన్ని॥

చరణం : 1
నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు
నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు
చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ
పండగై ఉంటాడు ఆడంగ పాడంగ
కలగలిసి ఉండాలి దండుగా
కడదాక ఉంటాను అండగా
సాగరా చాటరా జయం మనదేరా! ॥చిన్ని॥

చరణం : 2
పంటలతో నేల తల్లి పొంగెనే
సంపదతో పల్లెలన్నీ నిండెనే
సాగరా చాటరా జయం మనదేరా!
లల్లలాల లాలెలల్లా లాలెలల్లల్లే
నానా నాలె లాలె లాల్లలల్లల్లా

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |