చిత్రం : మూగప్రేమ (1976)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : చక్రవర్తి
గానం : పి.సుశీల
పల్లవి : ఈ సంజలో... కెంజాయలో... (2)
చిరుగాలుల... కెరటాలలో... ॥సంజలో॥
ఏ మల్లి మరులెల్ల ఎగబోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అహహహా... ఈ సంజలో...
చరణం : 1
ఆ... ఆ... హా... ఓ... ఓ... హో...
ఈ మేఘమే రాగస్వరమో ఆ...
ఆ రాగమే మూగపదమో ఆ... ॥మేఘమే॥
ఈ చెంగు ఏ వయసు పొంగో ఆ....
ఆ పొంగు ఆర్పేది ఎవరో
ఎవరో అదెవరో రెపరెపరెపరెపరెప
ఈ సంజలో...
చరణం : 2
ఊ... ఊ... హూ... ఆ... ఆ...హా...
పులకించి ఒక కన్నెమనసు ఆ...
పలికింది తొలి తీపి పలుకు ఊ... ॥
చిలికింది అది లేత కవిత ఆ...
పొదిగింది తనలోని మమత
మదిలో మమతలో
రిమజిమ రిమజిమ రిమజిమ
ఈ సంజలో...
చరణం : 3
ఆ... ఆ... హా... ఓ... ఓ... హో...
నా కళ్లలో ఇల్లరికము ఆ...
నా గుండెలో రాచరికము ఆ... ॥నా కళ్లలో॥
నీదేను నీదేను నిజము ఆ...
నేనుంది నీలోన సగము
సగమే జగముగా
కలకలక ల కిలకిలకి ల ॥సంజలో॥