Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : అశోక్ (2006)
రచన : చంద్రబోస్
సంగీతం : మణిశర్మ
గానం : కారుణ్య


పల్లవి :
ఏకాతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా
నీకై నేను ఆలోచిస్తున్నా
ఏ పనిచేస్తూన్నా ఎటు పయనిస్తూన్నా
నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్లు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్లై నీకోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా
నా తనువంతా మనసై ఉన్నా...
ఏకాతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా

చరణం : 1
రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో
ఇంకా చెప్పని సంగతులెన్నో నా ఎద గొంతుల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో
జతపడు మార్గంలో
మనసైన ఆక ర్షణలో మునకేస్తున్నా
ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా
నా వయసంతా వలపై ఉన్నా...
ఏకాతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా

చరణం : 2
స్పందన నేనై ఉంటా నీ హృదయంలోన
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోన
అర్చన నేనై ఉంటా నీ ఒడి గుడిలోన
వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోన
నీ జీవన నదిలో పొంగే నీరౌతున్నా
సంతోషం ఉప్పెంగే కన్నీరౌతున్నా
శత జన్మాల ప్రేమౌతున్నా
ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |