చిత్రం : ఠాగూర్ (2003)
రచన : సుద్దాల అశోక్‌తేజ
సంగీతం : మణిశర్మ
గానం : మనో, చిత్ర
పల్లవి :
గప్పు చుప్పు గప్పు చుప్పు గంతులెప్పుడు
నీ కొప్పులోన పూవులెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్ట చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు
అత్తిపత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలెడు
నిన్నుచూడగానే నేర్చుకుంది కాలు జారుడు
ఎప్పుడెప్పుడు... ॥చుప్పు॥
చరణం : 1
నువ్వు కానరాకపోతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చినంత కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత ఇచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడు
ఇంత అంత కాదు దీని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడు
ఎప్పుడెప్పుడు... ॥చుప్పు॥
చరణం : 2
ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు
నీ ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లని పూలు జల్లుడు
నీ పక్కలోన గుండెతోని గుండె అల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు
నన్నిలా మంచులా కరగదీసుడు
అమ్మొ ఎన్ని కలలు ఉన్నవయ్యా నీకు పిల్లడూ
ఎప్పుడెప్పుడు...
॥చుప్పు॥
16 May - నేడు సుద్దాల అశోక్‌తేజ బర్త్‌డే