Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ప్రేమలేఖలు (1977)
రచన : ఆరుద్ర
సంగీతం : సత్యం
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి : ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు ॥తీయని॥

చరణం : 1
ఆ... హా హా హా... ఆహా... ఆహాహా... సుజా...
నడిరాతిరి వేళ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగొలుపు ॥
నను చేతులతో నను పెనవేసి
నా ఒడిలో వాలును నీవలపు ॥తీయని॥

చరణం : 2
నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని ॥మనసే॥
నీ ఒంపులు తిరిగే అందాలు
కనువిందులు చేసే శిల్పాలు ॥తీయని॥

చరణం : 3
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు ॥పెదవులు॥
మన తనువులు కలిపే రాగాలు
కలకాలం నిలిచే కావ్యాలు ॥తీయని॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |