చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల
పల్లవి : మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత గానముతో నీవు నటన సేయగనే మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే ॥ చరణం : 1 నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా (2) గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా ॥ చరణం : 2 క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా (2) భ్రమరమ్ములు గుములు గుములుగా ఝుం ఝుమ్మని పాడగా ॥ చరణం : 3 తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా (2) రంగరంగ వైభవములతో ప్రకృతి విందు సేయగా ॥ |
06 May - పింగళి వర్ధంతి