చిత్రం : మేఘసందేశం (1982)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : రమేష్‌నాయుడు
గానం : పి.సుశీల
పల్లవి :
ముందు తెలిసెనా ప్రభూ...
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో కాస్త...॥
చరణం : 1
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద
సుమదళములు పరువనా (2)
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును... ॥
చరణం : 2
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగా
నీ పదముల బంధింపలేను
హృదయము సంకెల జేసి ॥