చిత్రం : పచ్చని సంసారం (1993)
రచన : భువనచంద్ర
సంగీతం : విద్యాసాగర్
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
పల్లవి :
పున్నాగ పూలతోటలో మాట ఇచ్చి మరువకు
మాట ఇచ్చి మరువకు
అందాల గువ్వ చేతిలో చేయి వేసి వదలకు
చేయి వేసి వదలకు
నీలాల నింగే సాక్షి నా మాట మరువనే
ఏడేడు జన్మల్లోన నీ చేయి విడువనే
॥
చరణం : 1
వెండి మబ్బు జాడలో తేలి ఆడే పావురం
గుండెపైన వాలితే చెప్పలేని సంబరం
మావిచివురులు కొసరినా
కోయిలా మురిపించకే
తేనె రుచులను మరిగిన తుమ్మెదా కవ్వించకే
పాల వెన్నెల్లో భామ పొంగిపోయిందే ప్రేమ కంటి రెప్పల్లో ఊయలూగవే
పున్నాగ పూలతోటలో...
మాట ఇచ్చి మరువను (2)
అందాల గువ్వ చేతిలో...
చేయి వేసి వదలను (2)
చరణం : 2
చల్లగాలి తరగనై గుండెలో నిదురించనా
కంచిపట్టు చీరనై ఒంటినే పెనవేయనా
మెరుపు వెలుగుల మగసిరి
వలపులను కురిపించకే
అణువు అణువున సొగసరి
అధరసుధలొలికించవే
నిండు కౌగిట్లో చేరి దొంగముద్దెట్టి కొట్టి
నా సిగ్గంతా తీయమాకురో ॥
నీలాల నింగే సాక్షి నా మాట మరువకు
ఏడేడు జన్మల్లోన నా చేయి విడువకు
31 May - నేడు కృష్ణ బర్త్‌డే