Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : చింతకాయల రవి (2008)
రచన : చంద్రబోస్, సంగీతం : విశాల్-శేఖర్
గానం : సోను నిగమ్, మహాలక్ష్మీ అయ్యర్


పల్లవి :
ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
ఎన్నడూ తెలియంది ఎందుకో
నాలో మొదలైంది ఎందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో
సొగసులకు ఈ రోజు బరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన చూపులోన తన రూపులోన
తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనెలోన మునిగేందుకా ॥

చరణం :
ఆ ఊరు ఈ ఊరు వేరైనా
ఆకాశం అంతా ఒకటేగా
ఆ నువ్వు ఈ నేను ఏడున్నా
ఆలోచ నలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయబారం
ఊసులే చేరవా వేగిరం
ప్రేమలో చిన్నదే ఈ ప్రపంచం
అని తెలిసి కూడ తెగ అలజడాయె
ఆ త లపులోనే తలమునకలాయె
మరి ఎందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన బాటలోన తన తోటలోన తన తోడులోన
తన నీడలోన నడిచేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన తనువులోన అణువణువులోన
మధువనములోన ప్రతికణములోన కలిసేందుకా ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |