Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : రంగం (2011)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : శ్రీరామ్ పార్థసారథి, బాంబే జయశ్రీ


పల్లవి :
ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నో సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు
కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి
ఇవ్వాళే వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు
నిన్నే పిలిచెనులే
॥మంచుల్లో॥

చరణం : 1
కనులకు జతగా వలపుల కథనే
కలలుగ కొసరనా
గలగల పలికే పెదవుల కొస
నే కబురునై నిలవనా
నేడిలా మది విరిసెను ప్రేమలో
తేనెలే పెదవొలికెను జంటలో కలయికలో
॥మంచుల్లో॥

చరణం : 2
మలుపులు దాటి మనసులు మీటి
నిలిచె నీ మమత లే
ఒకపరి జననం ఒకపరి మరణం
నిలువునా తొలిచెలే
యవ్వనం మనసుకు తొలి మోహనం
చుంబనం వయసుకు ఒక వాయనం
అనుదినము...
॥మంచుల్లో॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |