Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : స్వయంవరం (1999)
రచన : భువనచంద్ర
సంగీతం : వ ందేమాతరం శ్రీనివాస్
గానం : ఉదిత్‌నారాయణ్, స్వర్ణలత


పల్లవి :
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్తకొత్త ఊహలతో వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంటా
నిన్నుతాకి పొంగిపోవు నీలిమబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా జతచేరగా రావా॥

చరణం : 1
మంచు వెన్నెల స్నానమాడిన మల్లెపందిరిలో
వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో
ఏకాంతసేవకు ఉర్రూతలూగిన
శృంగార శిల్పానివా
కల్యాణ రాముని కౌగిట్లో ఒదిగిన
బంగారు పుష్పానివా
పంచుకో ప్రియతమా ప్రేమనీ
ప్రేమగా తీయగా తియతీయగా
తమకానివై ప్రేమ ॥

చరణం : 2
కదనసీమకు కాలుదువ్విన గడుసు మన్మథుడా
కౌగిలింతల కాటువెయ్యకు చిలిపి చందురుడా
వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన
వయ్యారి ముందుండగా
మందార పెదవుల గంధాలు తియ్యక
అయ్యారే ఉండేదెలా
అందుకో అధరమే హాయిగా ఏకమై
ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |