చిత్రం : నువ్వువస్తావని (2000)
రచన : ఇ.ఎస్.మూర్తి
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
గానం : హరిహరన్, చిత్ర
పల్లవి :
కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది
వస్తూ వస్తూ తనతో
వెన్నెల వెలుగులు తెస్తోంది
ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
చిలకమ్మా ఎదురేగీ స్వాగతాలు చెబుతావా
పూల పొదరిల్లే రా రామ్మన్నది
విన్నానమ్మా తీయని వేణువు
రమ్మను పిలుపుల్నీ
చూశానమ్మా స్వాగతమంటూ
తెరిచిన తలుపులనీ
చరణం : 1
పగలూ రాత్రి అంటూ తేడా లేనేలేని
పసిపాప నవ్వుల్ని చూడనీ
తోడూ నీడా నువ్వై నాతో నడిచే నీకు
ఏనాటి ఋణముందో అడగనీ
చేదు చేదు కలలన్నీ కరిగి తే నె వరదవనీ
కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని
ప్రతిజన్మకి ఈ నేస్తమే కావాలని
కోరుకుంటానమ్మా దేవుళ్లని
॥॥
చరణం : 2
ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే
ఏ పూలు తేవాలి పూజకి
నీతో జతగా ఉండే వర మే నువ్వే ఇస్తే
ఇంకేమి కావాలి ఈ జన్మకి
మచ్చలేని చంద్రుడిని మాటరాక చూస్తున్నా
వరసకాని బంధువుని చొరవచేసి అంటున్నా
ఇంకెప్పుడూ ఒంటరినని అనరాదని
నీకు సొంతం అంటే నేనే అనీ ॥