చిత్రం : నేను.. నా రాక్షసి (2011)
రచన, సంగీతం : రహమాన్
గానం : శంకర్ మహదేవన్
పల్లవి :
మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగలా
గుండె ల్లోన గొడవలా అరె చిచ్చే పెట్టిందేంటిలా
ఎహే మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు
మెదడుకు పొడిచిందే తూట్లు
ఆకలిని నిదురని మరిచి
అలుపెరుగక వెతికా వెతికా ॥మళ్లీ॥
చరణం : 1
అది మోనాలిసా చెల్లెలో
మరి మోహం పెంచే వెన్నెలో
అది బంగారానికి బంధువో
నా దాహం తీర్చే బిందువో
ఎవరిదీ అసలెవరిదీ...
ఇంతలా నను నిలువున తడిపిన
తొలకరి చినుకును
వెతికా వెతికా వెతికా వెతికా ॥మళ్లీ॥
చరణం : 2
ఏం పని లేదో ఏమిటో నాపై తనకి హక్కేమిటో
నన్నే నాకు వేరుగ నెట్టేసే ఈ ప్లానేమిటో
హాయిది తొలి దిగులుదీ...
వింతగా ఎద తొలిచిన గెలిచిన
సొగసరి చిలకను
వెతికా వెతికా వెతికా వెతికా ॥మళ్లీ॥