Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ప్రేమకావాలి (2011)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : అనూప్ రూబెన్స్
గానం : కె.కె.


పల్లవి :
సనిరీస సనిరీస నిసరీసా నిసరీసా
దనిప మపదనిసా సనిరిసా సనిరిసా
మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే ॥

చరణం : 1
విరిసిన పువ్వుల కొమ్మ
తను పెనవేసిన ఒక రెమ్మ
ఎవరో తెంచేస్తు ఉంటే ఒప్పుకుంటదా
బుడి బుడి అడుగుల పాపైనా
తన ఆడుకొనేదొక బొమ్మై
ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా
నువు నచ్చి మనసిచ్చి ఇపుడిక్కడేది చూస్తుంటే
కనుపాపల్లో కునుకుండదే... ఓ... ఓ... ॥

చరణం : 2
వెలుతురు ఉన్నపుడే గా నీ వెనుకనే ఉంటది నీడ
ఉంటా నడిరాతిరైనా నీకు తోడుగా
చిగురులు తిన్నపుడేగా
ఆ కుహు కుహు కోయిల పాట
అవుతా నీ గుండె లయగా అన్నివేళలా
నిను కోరా ఇటు చేరా
నువు ఎటువైపో అడుగేస్తే
ఎదలోతుల్లో కుదురుండదే... ఓ... ఓ... ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |