Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ముద్దమందారం (1981)
(దర్శకత్వం : జంధ్యాల)
రచన : వేటూరి, సంగీతం : రమేష్‌నాయుడు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
మందారం... ముద్దుమందారం
మందారం... ముద్దమందారం
ముద్దుకే ముద్దొచ్చే మువ్వకే నవ్వొచ్చే
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం (2) ॥

చరణం : 1
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
పరువాల పరవళ్లు పరికిణీ కుచ్చిళ్లూ
విరి వాలుజడ కుచ్చుల సందళ్లు
కన్నెపిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి ॥

చరణం : 2
పలుకులా రా చిలకలా
అలకలా ప్రేమ మొలకలా (2)
మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్లు
మల్లెపువ్వా కాదు మరుల మారాణి
బంతిపువ్వా పసుపు తాను పారాణి ॥

19 June - నేడు జంధ్యాల వర్ధంతి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |